![]() |
![]() |

బుల్లితెర షోస్ లో, ఈవెంట్స్ లో యాదమ్మ రాజు, స్టెల్లా ఇద్దరూ కలిసి మస్త్ కామెడీ చేసి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ యూట్యూబ్ ద్వారా ప్రాంక్ వీడియోస్ కూడా చేస్తూ అందరినీ కాసేపు నవ్వుకునేలా చేస్తారు. ఇప్పుడు యాదమ్మ రాజు ఇంట్లో దొంగలు పడ్డారు. ఐతే స్టెల్లా ఆ టైంకి వాళ్ళ అమ్మ గారింటికి వెళ్ళింది. యాదమ్మ రాజు బ్రేస్ లెట్ ని దొంగలు ఎత్తుకుపోయారు.
.webp)
అసలు ఇంట్లోకి ఎవరు వచ్చారో తెలీక కంగారు పడుతున్నారు యాదమ్మ రాజు అండ్ ఫ్రెండ్స్ టీమ్. సరిగ్గా అదే సమయానికి స్టెల్లా కూడా వాళ్ళ అమ్మగారి ఇంటి నుంచి తిరిగి వచ్చేసింది. ఈ విషయం గురించి యాదమ్మ రాజు స్టెల్లాని అడిగాడు. ఇంట్లో తన బ్రేస్ లెట్ ఎక్కడుంది..అది కనిపించడం లేదు..ఏమయ్యింది అని అడిగాడు. కనిపించకపోవడం ఏమిటి అది వెంకట్ రూమ్ లో ఉన్న బీరువాలో దాచినట్టు చెప్పింది. వెంకట్ యాదమ్మ రాజు తమ్ముడు. కానీ ఇప్పుడు ఆ బంగారు బ్రేస్ లెట్ కనిపించడం లేదు అని యాదమ్మ రాజు హడావిడి చేసేసాడు. స్టెల్లా కూడా కోపంతో ఇంట్లో అన్ని వెతికేసి వాళ్ళ ఫ్రెండ్స్ ని, వెంకట్ ని బాగా తిట్టేసింది. తర్వాత ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని చూసింది. ఇంట్లో ఎవరో తిరుగుతున్నారు..ఎవరు..ఇంట్లో లేనప్పుడు గదిలోకి వచ్చిందెవరు అంటూ యాదమ్మరాజును గట్టిగా నిలదీసింది. ఐనా సీసీ కెమెరా బెడ్ రూమ్ లో లేదు..ఒక్క హాల్ లోనే ఉంది కదా. అసలు ఇంట్లో ఎం జరుగుతోందంటూ యాదమ్మ రాజు మీద అతని ఫ్రెండ్స్ మీద ఫైర్ అయ్యింది. స్టెల్లా కోడిగుడ్డు ఈకలు పీకే ప్రశ్నలు వేసేసరికి అందరూ తడబడ్డారు. ఇప్పటి వరకు పోని బ్రేస్ లెట్ తాను ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే ఎందుకు పోయింది అని అడిగింది. చివరికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ ఐపోయింది స్టెల్లా. దాంతో ఇదంతా ప్రాంక్ అని యాదమ్మ రాజు సైలెంట్ గా చెప్పేసరికి స్టెల్లా నోరెళ్ళబెట్టి అవాక్కయ్యింది. వీళ్ళు ఇలాంటి ఎన్నో ప్రాంక్ వీడియోస్ చేస్తూ యుట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ ఉంటారు.
![]() |
![]() |